SKLM: రేగిడి గ్రామంలో పలువురు రైతులకు చెందిన 15 ఎకరాల చెరకు తోట విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంగళవారం దగ్ధమైంది. అగ్నిమాపక అధికారి సర్వేశ్వర రావు సిబ్బందితో వచ్చి మంటలను అదుపు చేశారు. రూ.14 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేశారు. రెవెన్యూ, విద్యుత్తు శాఖ అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.