అనంతపురం: సోమందేపల్లిలోని గంగమ్మగుడి వద్ద వర్షపు నీరు, చెరువు నీరు నిలవడంతో ప్రయాణానికి ఇబ్బంది ఉందని స్థానికులు మంత్రి సవిత దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి కల్వర్టు నిర్మాణానికి రూ. 25 లక్షలు విడుదల చేశారు. దీంతో ఆమెకు బుధవారం కృతజ్ఞతలు తెలిపి చీరను బహుకరించారు. కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు టీడీపీ అధ్యక్షుడు చంద్ర, గంగమ్మగుడి పూజారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.