VZM: విజయనగరం పట్టణంలో పలు కూడళ్ళు వద్ద లీగల్ మెట్రాలజీ అధికారులు చికెన్, మటన్, చేపల దుఖానాలను ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు చేశారు. చట్ట విరుద్ధమైన తూనిక రాళ్ళు వినియోగించి వినియోగదారులను మోసగించుచున్న ఐదుగురు చేపల వర్తకులపై కేసులు నమోదు చేశారు. ఇటువంటి మోసాలకు పాల్పడితే భారీగా అపరాధ విధిస్తామని, క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు.