NLR: ఉదయగిరి సబ్ ట్రెజరీ కార్యాలయంలో బుధవారం వార్షిక తనిఖీల్లో భాగంగా ఆడిట్ అధికారుల బృందం ఆడిట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆడిట్ అధికారులు మోషే,యుగంధర్,నరేంద్ర లు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లావాదేవీల రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.అనంతరం మాట్లాడుతూ.. ఆడిట్ నివేదిక అధికారులకు నివేదిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీఏ మమత, తదితరులు పాల్గొన్నారు.