మన్యం: కురుపాం సామాజిక ఆరోగ్య కేంద్రం నూతన కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు ఆసుపత్రి అభివృద్ధి నూతన కమిటీ ఛైర్మన్ ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించారు. ఆమెకు కమిటీ సభ్యులు, హాస్పిటల్ సిబ్బంది పుష్పగుచ్ఛం అందజేసి సాధారణంగా ఆహ్వానించారు. హాస్పిటల్కు సంబంధించి పలు విషయాలను ఆమె అధికారులను అడిగి తెలుసుకున్నారు.