KRNL: ఆలూరు నుంచి కర్నూలుకు వెళ్లే రోడ్డు మరమ్మత్తు పనులను వైసీపీ ఎమ్మెల్యే విరుపాక్షి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అన్నారు. వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించారన్నారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని పనులను త్వరగా పూర్తిచేయాలన్నారు.