NLR: దుత్తలూరు మండలంలోని నర్రవాడ గ్రామంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. భారీ వర్షం పడుతుండటంతో రోడ్లు గుంటలు పడి రాకపోకలకు ఇబ్బందిగా ఉందని ప్రజలు ఆరోపిస్తున్నారు. నర్రవాడ మెయిన్ రోడ్డు నుంచి జనార్దన్ దేవస్థానం వరకు గుంటలు పడ్డాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి గుంటలు పూడ్చాలని స్థానికులు కోరుతున్నారు.