ATP: జిల్లాలోని అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు ఆసుపత్రులలో మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని పీహెచ్సీ, సీహెచ్సీ, ఏరియా ఆసుపత్రిలో మౌలిక సదుపాయాల కల్పన పై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.