చిత్తూరు: చౌడేపల్లి మండలం లద్దిగం గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. లద్దిగం గ్రామ సమీపంలో ఉన్న చెరువులో అక్రమంగా ఇసుక రవాణాను అడ్డుకున్నారు. గత రెండు నెలలుగా కొందరు అధికార బలంతో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు వాపోయారు. తమ పంటలకు ఆధారంగా ఉన్న చెరువులో ఇసుకను తీసేస్తే నీటి ఎద్దడి ఏర్పడి రైతులు తీవ్ర నష్టపోతారని వారు వాపోయారు.