గుంటూరు: మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ బదిలీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ శాఖలో పలువురు సబ్ రిజిస్ట్రార్లని ప్రభుత్వం బదిలీలు చేసింది. ఈ బదిలీల్లో భాగంగా మంగళగిరి సబ్ రిజిస్టర్ షరిల్ బాబు గుంటూరు సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తెనాలిలో విధులు నిర్వహిస్తున్న బాల గురవయ్య సబ్ రిజిస్ట్రార్‌గా రానున్నారు.