NDL: బేతంచెర్ల పట్టణంలోని లయన్స్ క్లబ్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో బాలింతలు, గర్భిణులు, రోగులకు దాత కుప్ప శ్రీనివాసులు సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించినట్లు అధ్యక్షుడు సురా మధు సుధాకర్ రెడ్డి సోమవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు చంద్రశేఖర్, మనోహర్ రెడ్డి, కృష్ణారెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.