GNTR: మంగళగిరి చినకాకానిలోని హాయ్ ల్యాండ్ రోడ్డులో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్లో గత రాత్రి గుర్తుతెలియని దుండగులు రూ.70వేల నగదు, విలువైన వస్తువులను అపహరించారు. సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి మరి చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. అంతటితో ఆగకుండా ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో సెల్ ఫోన్లను ఎత్తుకుపోయారు. బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు.