SKLM: శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆనంద్ సాయిని టీటీడీ బోర్డు సభ్యుడిగా నియమించారు. పవన్ కళ్యాణ్ తొలిప్రేమ సినిమాలో తాజ్ మహల్ సెట్టింగ్‌తో ఆయన ఆర్ట్ డైరెక్టర్‌గా మంచిపేరు తెచ్చుకున్నారు. అలాగే తెలంగాణ యాదగిరి గుట్ట ఆలయ నిర్మాణ చీఫ్ డిజైనర్‌గానూ పనిచేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సన్నిహితుడు కావడంతో ఆయనకు ఆ పార్టీ కోటాలో బోర్డు సభ్యుడిగా అవకాశం కల్పించారు.