KMR: బిక్కనూర్ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరుపేదలకు వరం లాంటిదని, టీపీసీసీ జనరల్ సెక్రెటరీ ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. బుధవారం మండలంలోని రామేశ్వర్ పల్లి గ్రామంలో, ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా పాలనలో, అర్హులైన వారందరికీ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుందన్నారు.