కృష్ణా: జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో ఇసుక ర్యాంపు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్నారన్న సమాచారం మేరకు చిల్లకల్లు ఎస్సై శ్రీనివాస్ బృందంతో కలిసి దాడులు నిర్వహించారు. పట్టుబడిన వారిపై వాల్టా చట్టం క్రింద కేసునమోదు చేసి వాహనాలను సీజ్ చేసి, వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.