Kalyan Ram : కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టైల్. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. కానీ ఇటీవల వచ్చిన అమిగోస్ మూవీతోతో ఆకట్టుకోలేకపోయాడు.
కొత్త దర్శకులను పరిచయం చేయడం.. విభిన్న కథలతో సినిమాలు చేయడం.. హిట్టు, ఫట్టుతో సబంధం లేకుండా దూసుకుపోవడం.. నందమూరి కళ్యాణ్ రామ్ స్టైల్. ఈ క్రమంలోనే వరుస ఫ్లాపుల్లో ఉన్న కళ్యాణ్ రామ్.. బింబిసార మూవీతో భారీ విజయాన్ని అందుకున్నాడు.. కానీ ఇటీవల వచ్చిన అమిగోస్ మూవీతో ఆకట్టుకోలేకపోయాడు. డాపుల్ గ్యాంగర్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసింది. కానీ నటన పరంగా ట్రిపుల్ రోల్ చేసి దుమ్ముదులిపేశాడు. ఇక ఈ సినిమా తర్వాత కళ్యాణ్ నుంచి ‘డెవిల్’ అనే సినిమా రాబోతోంది. పీరియాడిక్ డ్రామాగా భారీ స్థాయిలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే డెవిల్ షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కు చేరుకుంది. ప్రస్తుతం క్లైమాక్స్ ఫైట్‌ను షూట్ చేస్తున్నారు. ఈ ఫైట్‌ను దాదాపు 500 మందితో భారీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. ఫైట్ మాస్టర్ వెంకట్ ఆధ్వర్యంలో డిజైన్ చేసిన ఈ ఫైట్.. సినిమాలో హై ఓల్టేజ్‌గా నిలుస్తుందని అంటున్నారు. ‘ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరికొత్త గెటప్‌లో కనిపించబోతున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా నిర్మిస్తున్నఈ చిత్రానికి.. నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. సంయుక్త మీనన్ మరియు మాళవిక నాయర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణ్ రామ్ కెరీర్లో 21వ చిత్రంగా.. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి డెవిల్తో కళ్యాణ్ రామ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.