Varasudu : కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు 'వారిసు' సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్ అయింది. అయితే తెలుగు ఆడియెన్స్‌కి ఈ సినిమా నచ్చకపోయినా.. తమిళ్లో మాత్రం విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో ఇళయ దళపతి విజయ్‌తో టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ‘వారిసు’ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే. తెలుగులో ఈ సినిమా వారసుడుగా డబ్ అయింది. అయితే తెలుగు ఆడియెన్స్‌కి ఈ సినిమా నచ్చకపోయినా.. తమిళ్లో మాత్రం విజయ్ ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. 250 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి.. విజయ్ కెరీర్లోనే హెయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటించింది. తమన్ మ్యూజిక్ అందించాడు. అయితే సినిమా టాక్ ఎలా ఉన్నా.. తమన్ మాత్రం నెక్స్ట్ లెవల్ బీజిఎం ఇచ్చాడు. దిల్ రాజు కూడా చెప్పినట్టే తమిళ్లో భారీ హిట్ కొట్టి చూపించాడు. అయితే చాలా వరకు తమిళ తంబీలు ఈ సినిమాను చూసేసినప్పటికీ.. తెలుగు వారు మాత్రం పెద్దగా థియేటర్‌కి వెళ్లలేకపోయారు. దాంతో వారసుడు ఓటిటి డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ ఓటిటి రిలీజ్ డేట్‌ని ఫిక్స్ చేసుకుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటిటి ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. అందుకోసం భారీ మొత్తంలో చెల్లించినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. ఈ సినిమాను జనవరి 11న తమిళ్ వెర్షన్, 14న తెలుగు వెర్షన్ థియేటర్ వెర్షన్ రిలీజ్ చేశారు. దాంతో 40 రోజులకే ఓటిటిలోకి వచ్చేస్తున్నాడు వారసుడు. రిలీజ్ అయిన అన్ని భాషల్లో కలిపి ఫిబ్రవరి 22 నుంచి అమేజాన్ ప్రైమ్‌లో అందుబాటులోకి రానున్నట్టుగా.. అధికారికంగా ప్రకటించారు. దాంతో థియేటర్లో ఈ సినిమాను మిస్ అయిన వారు.. 22 నుంచి ఓటిటిలో చూసేయండి.