Pawan Kalyan : వైరల్‌గా మారిన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ లుక్ టెస్ట్ షూట్!
Pawan Kalyan : ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సముద్రఖని దర్శకత్వంలో 'వినోదయ సీతం' రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజీత్ 'ఓజి' సినిమాల షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.
ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సముద్రఖని దర్శకత్వంలో ‘వినోదయ సీతం’ రీమేక్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన వెంటనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ ‘ఓజి’ సినిమాల షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. ఈ నెలాఖరు లేదా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తాజాగా పవన్‌కళ్యాణ్ లుక్ టెస్ట్‌కు సంబంధించిన షూట్‌ను నిర్వహించింది. ప్రస్తుతం ఈ లుక్ టెస్ట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల్లో దర్శకుడు హరీష్ శంకర్, సినిమాటోగ్రాఫర్ అయానక బోస్ కనిపిస్తున్నారు. త్వరలోనే పవన్ లుక్‌తో పాటు ఈ సినిమా షూటింగ్ గురించి అఫిషీయల్ అప్డేట్స్ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమా ఓ షెడ్యూల్ అయిపోగానే.. ఓజి షూటింగ్లో జాయిన్ అవనున్నారు పవన్. అలాగే క్రిష్ తెరకెక్కిస్తున్న ‘హరిహర వీరమల్లు’ని కూడా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్స్ లోపు.. కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు పవన్. అందుకే నాన్ స్టాప్‌గా ఈ సినిమాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇక గబ్బర్‌సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా కావడంతో.. ఉస్తాద్ భగత్‌సింగ్ పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హీరోయిన్గా శ్రీలీల పేరు వినిపిస్తోంది. అయితే ఈ సినిమా తమిళ్ మూవీ ‘తేరి’ రీమేక్ అని అంటున్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.