Sudhir Babu : షాకింగ్ లుక్.. లడ్డు బాబుగా మారిన సుధీర్ బాబు!
Sudhir Babu : సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గానే 'హంట్' అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు.
సూపర్ స్టార్ కృష్ణ అల్లుడిగా.. హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుధీర్ బాబు.. తనకంటూ ఇండస్ట్రీలో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. నైట్రో స్టార్ అనే బిరుదుతో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. రీసెంట్‌గానే ‘హంట్’ అనే సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. అయితే ఈ సినిమా.. థియేటర్లోకి ఇలా వచ్చి, అలా వెళ్లిపోయింది. ప్రస్తుతం ‘మామా మశ్చీంద్రా’ అనే వెరైటీ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా మూడు విభిన్న పాత్రలో కనిపిస్తున్నాడు. దుర్గా, డీజే, పరశురాం అనే క్యారెక్టర్స్ చేస్తున్నాడు. తాజాగా దుర్గ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ‘దుర్గ’ అనే బరువైన పాత్రలో మీ దిల్ దోచేయడానికి వస్తున్నాడు.. అంటూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇక ఈ లుక్‌తో నైట్రో స్టార్ నెటిజన్స్‌కు షాక్ ఇచ్చేశాడు. సుధీర్ బాబు కాస్త లడ్డుబాబుగా మారిపోయాడు. గతంలో అల్లరి నరేష్ నటించిన లడ్డుబాబు గుర్తు రాక మానదు. బబ్లీ లుక్‌లో సుధీర్ బాబును గుర్తు పట్టడం కాస్త కష్టమే. లావుగా ఉండటమే కాదు.. డ్రెస్సింగ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా డిఫరెంట్‌గా ఉంది. దీంతో మామా మశ్చీంద్ర టైటిల్‌కు తగ్గట్టే.. సుధీర్ బాబు ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇక పరశురాం పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ మార్చి 4న, డీజే లుక్‌ను7న రిలీజ్ చేయబోతున్నారు. అయితే దుర్గ రోలే ఇంత షాక్ ఇస్తే.. మిగతా క్యారెక్టర్స్‌తో ఇంకెలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. మరి నైట్రో స్టార్ ఈ సినిమాతో అయినా.. సాలిడ్ హిట్ అందుకుంటాడేమో చూడాలి.