Shah Rukh Khan: జవాన్ ప్రమోషన్స్‌లో బాద్ షా బిజీ.. అభిమానులతో ఇంటరాక్ట్
#AskSRK పేరుతో నెల నెల అభిమానులతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఇంటరాక్ట్ అవుతారు. ఈ సారి కూడా ఇంటరాక్ట్ కాగా.. ఆయన కొత్త సినిమా జవాన్ గురించి ప్రశ్నలు రాగా.. అంతే కూల్‌గా ఆన్సర్ చేశారు.
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ (Shah Rukh Khan) తన కొత్త సినిమా జవాన్ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. #AskSRK సెషన్లో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యారు. వారు అడిగిన ప్రశ్నలకు ఫన్నీ ఆన్సర్ చేశారు. మూవీ కోసమే కాదు ప్రతీ నెల #AskSRK అనే పేరుతో ఫ్యాన్స్‌తో మాట్లాడుతుంటారు. ఈ సారి జవాన్ మూవీ గురించి ప్రశ్నలు రాగా.. ఓపికతో సమాధానం ఇచ్చారు.
ఈ ఏడాది ‘పఠాన్’ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించాడు షారుక్ ఖాన్ (Shah Rukh Khan). ఆ తర్వాత నెక్ట్స్ మూవీ జవాన్.. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సాయంత్రం మీ ప్లానింగ్ ఏంటి? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు షారూక్ (Shah Rukh) సమాధానం ఇస్తూ ‘అట్లీతో కలిసి ‘జవాన్’ సినిమాను చూడాలనుకుంటున్నా’ అన్నారు. ప్రస్తుతం మీరు డంకీ, జవాన్ సినిమాలు చేస్తున్నారు. వీటిలో మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిన సినిమా ఏది? అని అడిగితే.. జవాన్ అని.. అందుకు కారణం అందులో యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా ఉండటమేనని అన్నారు.
ఓ అభిమాని షారూక్ ఖాన్‌తో (Shah Rukh Khan) ‘జవాన్’ నుంచి ఓ ఫొటోను అయినా చూపించాలని రిక్వెస్ట్ చేయగా.. ‘తప్పకుండా సెప్టెంబర్ 7న కలుద్దాం’ అని సమాధానం చెప్పారు షారూక్. ‘జవాన్’ మూవీలో విలన్‌గా నటించిన విజయ్ సేతుపతితో వర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్ గురించి మరో అభిమాని ప్రశ్నించాడు. ‘విజయ్ సేతుపతి అద్భుతమైన నటుడు. నేనెంతో అభిమానించే నటుడు. జవాన్‌లో అతనితో కలిసి నటించటం ఓ కూల్ ఎక్స్‌పీరియెన్స్ అని వివరించారు. ఇలా ఫ్యాన్స్ అడిగిన అన్నీ ప్రశ్నలకు ఓపికగా సమాధానం ఇచ్చాడు.