ఆర్ఆర్ఆర్ సినిమా విషయంలో మొదటి నుంచి బీజేపీ రాజకీయాలు చేస్తోంది. గతంలో బండి సంజయ్ కుమార్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించే థియేటర్లపై దాడి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సినిమా విడుదలై ఆస్కార్ బరిలో నామినేషన్లు వేసే విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వివక్ష చూపింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఆ వెయిటింగ్ అంతా ఇంతా కాదు.. ఏకంగా బాలీవుడ్ బడా హీరోలను సైతం వెనక్కి నెట్టి.. నెం.1 ప్లేస్‌లో నిలిచింది పుష్ప2.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఒక్కోసారి పవన్ చేసే పనులకు.. అరె ఇది కొంచెం ఓవర్ అయినట్టుందే.. అనేలా ఉంటుంది వ్యవహారం. తాజాగా మెగా మేనల్లుడు విషయంలో పవన్ చేసిన పనికి ఇదే కామెంట్స్ వినిపిస్తున్నాయి. కామెంట్సే కాదు ట్రోల్ కూడా చేస్తున్నారు నెటిజన్స్.
ప్రస్తుతం ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఆరోగ్యం మెరుగవుతోందని.. త్వరలోనే డిశ్చార్జి చేస్తామని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది. కాగా శరత్ బాబు అనారోగ్యం విషయం తెలుసుకున్న సినీ పరిశ్రమకు చెందిన వారు ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు.