టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ బాబు గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ మే22న తుదిశ్వాస విడిచారు. కన్నుమూశారు. దీంతో తెలుగు, తమిళ్ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ వద్ద ఆయనకు నివాళులు అర్పించారు.
ఎన్‌టీఆర్ ఫ్యాన్స్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సింహాద్రి సినిమా రీ రిలీజ్ సందర్భంగా మేకలను బలి ఇచ్చిన కేసులో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
బాలీవుడ్ ఫేమస్ డ్యాన్సర్ రాఖీ సావంత్ ఓ పాటకు తన పాకిస్థానీ డ్యాన్స్ పార్ట్ నర్ తో కలిసి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.
హాస్యబ్రహ్మ బ్రహ్మానందం (Brahmanandam) ఇంట పెళ్లి సందడి ప్రారంభమైంది. ఆయన రెండో కుమారుడు సిద్ధార్థ్ పెళ్లి పీటలెక్కబోతున్నారు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ పద్మజా వినయ్ కుమార్తె ఐశ్వర్యను సిద్ధార్థ్ పెళ్లి చేసుకోనున్నారు. ఐశ్వర్య కూడా డాక్టరే. ఆదివారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది.
ఆదిత్యసింగ్ రాజ్‌పుత్(Aditya Singh Rajput) ముంబైలో నివాసం ఉంటున్నాడు. సోమవారం మధ్యాహ్నం ఆదిత్యసింగ్‌ను కలిసేందుకు అతని స్నేహితుడు వెళ్లగా బాత్రూమ్‌లో పడిపోయి ఉన్నాడు. వాచ్‌మెన్ సాయంతో ఆదిత్యసింగ్‌ను ఆస్పత్రి(Hospital)కి తరలించగా అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు తెలిపారు.
నేను స్డూడెంట్ సార్ చిత్రం నుంచి ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్‌తోనే మూవీ కాన్సెప్ట్‌పై కాస్త క్లారిటీ ఇచ్చేందుకు మేకర్స్ ట్రై చేశారు.
విలక్షణ నటుడు కమల్ హాసన్ అరుదైన అవార్డు అందుకోనున్నాడు. ఇప్పటి వరకు చాలా అవార్డులు అందుకున్న ఆయన, మరో అవార్డు అందుకోనున్నాడు. ఆయన దాదాపు ఆరు దశాబ్ధాలుగా తన నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఆయన తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. ఈ మూవీ తర్వాత ఆయన బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. వార్ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కాగా, దానికి మించి ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ఈ ఏడాది చివరి కల్లా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
చాలా మూవీలకు హీరీలు మారడం, డైరెక్టర్లు మారడం, హీరోయిన్లు మారడం సర్వ సాధారణం. చాలాసార్లు ముందు ఒక హీరోతో అనుకున్న సినిమా, తర్వాత మరో హీరోతో చేయాల్సి వచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో మహేష్ చేయాల్సిన ఓ సినిమా ఇప్పుడు బాలీవుడ్ హీరో హృతిక్ ఖాతాలోకి పోయింది.
తన సొంత బ్యానర్లో కృష్ణ(Super star Krishna) ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నారు. అప్పట్లో 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది.
సముద్రఖని, అనసూయ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా విమానం. తాజాగా విమానం మూవీ నుంచి లిరికల్ సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
టాలీవుడ్ దర్శకుడు ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా మళ్లీ పెళ్లి. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్‌లు జంటగా ఈ మూవీలో నటిస్తున్నారు. తమ జీవితంలోని ముఖ్య ఘట్టాలతో ఈ మూవీ రూపొందుతోంది. మే 26న ఈ సినిమా విడుదల కానుంది.
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబుతో ‘కొబ్బరి మట్ట’ సినిమా తీసిన డైరెక్టర్ రూపక్ రోనాల్డ్ సన్ ఇప్పుడు 'పరేషాన్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
‘దేవర’ ఫస్ట్ లుక్(Devara First look)కు వచ్చిన అద్భుతమైన స్పందనకు ఎన్టీఆర్(NTR) కృతజ్ఞతలు తెలిపారు. తన పుట్టినరోజును ఇంత ప్రత్యేకంగా మార్చినందుకు తన స్నేహితులకు, కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు, నటీనటులకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ ఆదివారం కన్నుమూశారు. కూకట్ పల్లిలోని తన నివాసంలో రాజ్ గుండెపోటుకు గురయ్యారు.