Jr.NTR : గందరగోళంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఎన్ని రీ రిలీజ్లు సామి!?
Jr.NTR : ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొన్ననే ఓ యాక్షన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది.
ట్రిపుల్ ఆర్ సినిమాతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో NTR30వ సినిమా చేస్తున్నాడు. ఇటీవలె ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అయింది. మొన్ననే ఓ యాక్షన్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేసుకుంది. ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్ 5న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో ఈ ఏడాదిలో ఎన్టీఆర్ నుంచి థియేటర్లోకి సినిమాలు రానట్టే. కానీ రీ రిలీజ్ ఆప్షన్స్ ఉండడంతో.. టైగర్ ఫ్యాన్స్ అస్సలు తగ్గేదేలే అంటున్నారు. ఫ్యాన్సే కాదు మూవీ మేకర్స్ కూడా రీ రిలీజ్ సినిమాలతో పోటీ పడుతున్నారు. ఈసారి ఎన్టీఆర్ బర్త్డే ను ఓ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారు. అందుకే మే 20న రీ రిలీజ్ సినిమాలతో రచ్చ చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్లో రూపొందిన బ్లాక్బస్టర్ మూవీ సింహాద్రి మూవీని.. మే 20న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు. 4కే, డాల్బీ అట్మాస్ సౌండ్ వెర్షన్లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. కొత్త సినిమా రేంజ్లో దాదాపు 150కిపైగా థియేటర్లలో ఈ సినిమా రీ రిలీజ్కు సన్నాహాలు చేస్తున్నారు. ఇక అదే రోజు.. ఎన్టీఆర్, వినాయక్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆది’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ రెండు సినిమాల నిర్మాతలు వేర్వేరు కావడంతో.. ఎట్టి పరిస్థితుల్లోను రీ రిలీజ్ చేసి తీరుతామనే చెబుతున్నారు. ఈ రెండు సినిమాలే కాదు.. ఎన్టీఆర్ నటించిన ఫస్ట్ మూవీ ‘నిన్ను చూడాలని’ సినిమాను మే 19న థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఒకేసారి ఇన్ని సినిమాలను రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తుండటంతో ఏ సినిమా చూడాలో తెలియక గందరగోళంలో పడిపోయారు తారక్ ఫ్యాన్స్. కానీ ‘సింహాద్రి’ తర్వాతే మిగతా సినిమాలు అంటున్నారు. మరి అప్పటి వరకు వీటిలో ఏమైనా పోస్ట్ పోన్ అవుతాయెమో చూడాలి.