జబర్దస్త్ షో(Jabardasth show) ద్వారా పాపులర్ అయిన ముక్క అవినాష్(Mukku avinash) తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు. 2021 అక్టోబర్లో అనూజ(Anooja)ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. త్వరలోనే వీరిద్దరూ ముగ్గురవుతున్నట్లు తెలిపాడు. తాము తల్లిదండ్రులం కాబోతున్నామని, ఇద్దరం ముగ్గురం అవుతున్నామని సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నాడు. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు అవినాస్, అనూజలకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
అవినాష్(Mukku avinash) మొదట జబర్దస్త్ కామెడీ షో(Jabardasth show)తో గుర్తింపు తెచ్చుకున్నాడు. అందులో టీమ్ లీడర్ దాకా ఎదిగి ఆ తర్వాత బిగ్ బాస్లోకి ఎంటరయ్యాడు. బుల్లితెరపైనే కాకుండా వెండితెరపై కొన్ని సినిమాల్లోనూ కనిపించాడు. తన భార్య అనూజతో కలిసి పలు టీవీ రియాలిటీ షోల్లో పాల్గొన్నాడు.
తన భార్య అనూజ(Anooja) గర్భంతో ఉందని, ఇప్పుడు నాలుగో నెల అని, పెళ్లైన ఏడాదిన్నరకే పిల్లలు కలగడం ఆనందంగా ఉందన్నారు. మూడో నెల అయ్యేంత వరకూ డాక్టర్లు ఎవ్వరికీ చెప్పొద్దన్నారని, అందుకే నాలుగో నెల వరకూ చూసి చెబుతున్నట్లు తెలిపాడు. తమ కంటే తన అమ్మానాన్న, అత్తామామలు ఎంతో ఆనందంగా ఉన్నారన్నారు. నాలుగో నెలలో తమ బిడ్డ గుండెచప్పుడు కూడా విన్నామని, ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేమని ముక్కు అవినాష్(Mukku avinash) తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు.