తెలుగులో మహేష్ బాబుతో ఓ సారి, రామ్ చరణ్‌తో కలిసి రెండుసార్లు రొమాన్స్ చేసింది బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ. మహేష్‌తో కలిసి భరత్ అనే నేను, చరణ్ సరసన వినయ విధేయ రామ.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తోంది కియారా. అయితే కెరీర్ పీక్స్‌లో ఉండగానే పెళ్లి చేసుకుంది అమ్మడు. అంతే కాదు.. త్వరలోనే గుడ్ న్యూస్ కూడా చెప్పబోతోందట.
ప్రస్తుతం సౌత్‌తో పాటు బాలీవుడ్(Bollywood)లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది కియారా అద్వానీ(Kiara Advani). బాలీవుడ్ ఈ బ్యూటీ గోల్డెన్ లెగ్గా పేరు తెచ్చుకుంది. ఆమె నటించిన హిందీ చిత్రాలన్నీ కూడా మంచి విజయాన్ని సాధించాయి. అయితే కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే అమ్మడు పెళ్లి పీఠలెక్కేసింది. చాలా కాలంగా యంగ్ హీరో సిద్ధార్థ మల్హోత్రాతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది కియారా అద్వానీ. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. జైపూర్‌లోని ప్యాలెస్‌లో అంగరంగ వైభవంగా వీళ్ల పెళ్లి జరిగింది.
ఇటీవలే వెకేషన్ పూర్తి చేసుకుని వచ్చిన ఈ జంట.. ప్రస్తుతం ఎవరి సినిమాలతో వారు ఫుల్ బిజీ అయిపోయారు. కానీ అప్పుడే కియారా అద్వానీ(Kiara Advani) ప్రెగ్నెంట్ అనే న్యూస్ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ బ్యూటీ రిలీజ్‌కు రెడీగా ఉన్న తన సినిమా ‘సత్యప్రేమ్ కీ కథా’ ప్రమోషన్లో భాగంగా.. జైపూర్‌లో కార్తిక్‌తో కలిసి సందడి చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే.. ఈ ఫోటోలలో కియారా అద్వానీ బేబి బంప్‌తో ఉన్నట్లుగా కనిపిస్తోంది.
దాంతో కియారా(Kiara Advani) త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. అప్పుడే కియారా ప్రెగ్నెంట్ అని ఖచ్చితంగా చెప్పలేం. ఆమె వేసుకున్న డ్రెస్ వల్లే అమ్మడు అలా కనిపిస్తుందనే సందేహాలు వెలువడుతున్నాయి. మరి కియారా నిజంగానే ప్రెగ్నెంట్ అయిందా? లేదో? తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.