అక్కినేని హీరో అఖిల్ ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా స్పై థ్రిల్లర్ మూవీగా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్ గా అరంగేట్రం చేస్తోంది. ఈ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి ఒక బిగ్ అప్ డేట్ రానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జనవరి 26వ తేదిన ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం. ఈ విషయం తెలియడంతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఏకే ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మాలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి కీలక రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని నానకరాంగూడలో షూటింగ్ జరుగుతోంది. హిప్ హాప్ తమిళ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ఏజెంట్ మూవీ ఓ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమా మూవీకి సంబంధించిన కొన్ని పోస్టర్లు, టీజర్ ఇప్పటికే విడుదలైంది. ఈ సినిమాలో అఖిల్ సిక్స్ ప్యాక్ తో కనిపించనున్నాడు.