ఒక హీరో కోసం రెడీ చేసిన కథ మరో హీరో చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. హీరోలకు కథ నచ్చకపోవడం వల్ల మారడం, లేదా కారణం ఏదైనా ఒక హీరో చేతి నుంచి మరో హీరో కథలు మారుతూనే ఉంటాయి. తాజాగా అల్లు అర్జున్ చేయాల్సిన ఓ సినిమా నితిని చెంతకు చేరింది.
కొన్ని సంవత్సరాల క్రితం డైరెక్టర్ శ్రీరామ్ వేణు(Director Sriram Venu), అల్లు అర్జున్ (Allu Arjun)తో ఓ సినిమా తీయాలని అనుకున్నారు. దానికి ఐకాన్(Icon) అనే పేరు కూడా పెట్టాలని అనుకున్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దీంతో, ఆ మూవీ అక్కడే ఆగిపోయింది. ఇక అల్లు అర్జున్ తన తర్వాతి సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. అయితే, మూడేళ్లుగా ఈ సినిమా తీయాలని ఎదురు చూస్తున్న డైరెక్టర్ శ్రీరామ్ వేణు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. తన మూవీలో హీరోని మార్చేశారు. నితిన్ (Nitin)తో సినిమా తీయాలని నిర్ణయం తీసుకున్నారు. తాజా కథనాల ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే, తాను అల్లు అర్జున్ తో అనుకున్న ఐకాన్ స్టోరీ నే ఇప్పుడు నితిన్ తో తీస్తున్నారట. దాని కోసం స్క్రిప్ట్ లో మార్పులు మాత్రం చేశారట.
స్క్రిప్ట్ మార్చి నితిన్ (Nitin)కి చెప్పడంతో ఆయన వెంటనే అంగీకరించారట. అయితే టైటిల్ మాత్రం ఐకాన్ (Icon)అనే ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక నితిన్ తో ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు త్వరలోనే ప్రారంభించాలని అనుకుంటున్నారు. ప్రాజెక్ట్ అధికార ప్రకటన త్వరలోనే వెలువుడనుందని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్ వక్కంతం వంశీ, వెంకీ కుడుమలతో నితిన్ సినిమాలను అంగీకరించి ఉన్నాడు. ఆ రెండు సినిమాలు షూటింగ్స్ జరుగుతున్నాయి. అవి అవ్వగానే, ఈ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.