మన దేశంలో అభివృద్ధి చేసిన యాంటీ కొలిజన్ డివైజ్ కవచ్‌ను వందే భారత్ రైలుపై విజయవంతంగా ట్రయల్ చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Kavach System Trail : దేశంలో రానున్న రోజుల్లో హైస్పీడ్ రైళ్లు అధికం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేగంగా వచ్చే రైళ్లు పరస్పరం ఢీ కొట్టకుండా చేసే యాంటీ కొలిజన్ డివైజ్ ‘కవచ్’ను దేశీయంగా అభివృద్ధి చేశారు. దీని తొలి ట్రయల్ శుక్రవారం విజయవంతం కావడం పట్ల రైల్వే అధికారులు హర్షం వ్యక్తం చేశరు. 160 కిలో మీటర్ల వేగంతో వస్తున్న వందే భారత్ రైలు(Vande Bharat Rail) కు కవచ్ వ్యవస్థ(Kavach System) ఆటోమేటిక్ బేకులు వేయగలిగిందని వెల్లడించారు.
ఈ విషయంపై ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్వో ప్రశస్తి శ్రీ వాస్తవ మాట్లాడారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర, పాల్వాల్ మధ్య ఈ ట్రయల్ జరిగిందని తెలిపారు. గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న వందేభారత్ రైలుకు ఈ వ్యవస్థ ఆటోమేటిక్‌గా బ్రేకులు వేసిందని తెలిపారు. మొదటి ట్రయిల్‌లో లోకో పైలట్ బ్రేకులు వేయలేదన్నారు. అయినా అందులోని కవచ్ వ్యవస్థ రెడ్ సిగ్నల్‌ను గుర్తించి బ్రేకులు వేసిందని చెప్పారు. సిగ్నల్‌కు 10 మీటర్ల దూరంలో రైలును ఆపేసిందని వెల్లడించారు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో 16 బోగీలున్న వందే భారత్ రైఏళ్లపై దీన్ని ట్రయల్ చేయనున్నారు. తర్వాత ఈ బ్రేకింగ్ వ్యస్థను దేశవ్యాప్తంగా ఉన్న రైళ్లలో ఏర్పాటు చేసేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. గతంలో మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లపైన దీన్ని విజయవంతంగా పరీక్షించారు.