Sapta Sagaralu Dhaati Side B: మను, ప్రియ ప్రాణంగా ప్రేమించుకుంటారు. భవిష్యత్తుపై ఎన్నో కలలు కంటుంటారు. డబ్బులు కోసం చేయని నేరం అంటే హిట్ అండ్ రన్ కేసును తన మీద వేసుకొని మను జైల్ కు వెళ్తాడు. గుండెపోటుతో మను బాస్ చనిపోవడంతో.. మను జైల్లోనే ఉండిపోతాడు. ప్రియ వాళ్ల అమ్మ మనును మరిచిపో అని బలవంతంగా మరోకరితో పెళ్లికి ఒప్పిస్తుంది. తరువాత ఏం జరిగిందో సైడ్ బీలో తెలుసుకుందాం సప్తసాగారాలు దాటి సైడ్ బీ 2021 టైటిల్ పడుతుంది. మను జైల్ నుంచి బయటకు వచ్చి ప్రకాశ్ ను కలుస్తాడు. ప్రకాశ్ ఒక చిన్న ఇంట్లోకి తీసుకెళ్లి కొన్నాళ్లు ఇక్కడే అడ్జెస్ట్ అవమని చెప్తాడు. తనకు ప్రియ మాట్లాడి రికార్డు చేసిన క్యాసెట్, టెపు రికార్డు ఇస్తాడు. ప్రియ మాటలు వింటూ తన రోజు జీవితాన్ని గడుపుతుంటాడు మను. తరువాత తను జైల్లో నేర్చుకున్న పనిలోనే, నూలు తయారు చేసే ఫ్యాబ్రిక్ సెక్షన్ లో పని మొదలు పెడుతాడు. రాత్రిళ్లు క్యాబ్ డ్రైవ్ చేస్తుంటాడు. అదే సమయంలో తనకు ప్రియ గుర్తుకు వస్తుంది. ఇదే రోటీన్ అవుతుంది. తన మాటలను క్యాసెట్లో వింటూ, వర్క్స్ చేసుకుంటూ ఉంటాడు.
చదవండి:Priyanka Mohan: లిప్ లాక్ సీన్స్ పై ప్రియాంక ఏమందంటే?
తను ఒక రోజు వేశ్యను కలుస్తాడు. తనతో ప్రేమగా మాట్లాడుతాడు. తన పేరు సురభి. సురభి కూడా మనుతో ప్రేమగానే ఉంటుంది. తన గతం గురించి అడుగుతుంది. మొహంపై గాట్ల గురించి అడుగుతుంది. డబ్బులు ఇస్తే కొన్ని తీసుని తన జేబులో కొన్ని డబ్బులు పెడుతుంది. వాటిని తనకే ఇచ్చి పాట పాడమంటాడు. తనకు బాధ అనిపించిన ప్రతీ సారి ప్రియ మాటలు వింటాడు మను. ప్రియ గుర్తుకు వస్తుంది. తనకు ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేస్తే ఏమి మాట్లాడడు. బాధ పడుతాడు. ఇది కాదు జీవితం అని తాను కలలు కన్న సముద్రం దగ్గరకు వెళ్లాలననుకుంటాడు. కానీ ఒక్క సారి ప్రియను చూసి వెళ్లాలని ఉందని ప్రకాశ్ తో చెప్తే, ప్రకాశ్ వద్దంటాడు. తనకు భర్త, పిల్లలు ఉంటారు. తనను డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదని చెప్తాడు.
నెక్ట్స్ సీన్లో బస్టాప్ దగ్గర సురభిని చూస్తాడు. సినిమాకు వెళ్దామా అంటే నేను గర్ల్ ఫ్రెండ్ ని కాదు అని అంటుండగా డబ్బులు ఇస్తా అని అంటాడు. ఇద్దరు కలిసి సినిమా చూస్తారు. నీకు సముద్రం అంటే ఇష్టమా అని అంటే లేదు అంటుంది సురభి. తరువాత ఇద్దరు బస్సులో వెళ్తుంటే తను వేరే కస్టమర్ దగ్గరకు వెళ్లాలని, ఈ పని ఎవరు ఇష్టపడి చేయరు అంటుంది. ప్రియ లోకేషన్ కనిపెట్టడానికి హెల్ప్ చేయమంటాడు మను.
తరువాత సీన్లో ప్రియకు ఫోన్ చేస్తుంది సురభి. కట్ చేస్తే మను ప్రియ పనిచేసే చోటుకు వెళ్తాడు. దూరం నుంచి తనను ఫాలో అవుతుంటాడు. తన కొడుకును చూస్తాడు. గ్రౌండ్ లో తన కొడుకును దిగబెట్టి వెళ్తుంది ప్రియ. తనతో మను మాట్లాడుతాడు. ప్రియ సరకులు తీసుకొని కష్టపడుతుండం, పనులో చేసుకోవడం చూసి మను బాధ పడుతుంటాడు. ప్రియ ఇంటిని ఒక రైల్వే బోగిలోంచి చూస్తూంటాడు. తను సంతోషంగా లేదని అర్థం చేసుకుంటాడు. తన భర్త గురించి తెలుసుకోవాలనుకుంటాడు. ఇదే విషయాన్ని ప్రకాశ్ తో చెప్తే, ఇది కరెక్ట్ కాదు మను, తనను వదిలేయ్ నీ లైఫ్ చూసుకో అని చెప్తాడు. కానీ మను తన భర్త దీపక్ ను ఫాలో అవుతాడు. దీపక్ పొద్దు పొద్దున్నే వైన్స్ కు వెళ్లి తాగుతాడు.
తరువాత సురభిని కలిసి ప్రియ ఆనందంగా లేదని చెప్తాడు. తరువాత లవ్ గురించి పెద్దగా ఆలోచించకు అని అంటుంది సురభి. నువ్వు కూడా పెళ్లి చేసుకో అని అంటుంది. నల్లపూసల గొలుసు ఇచ్చి పెళ్లి చేసుకుందాం అని అంటాడు. సురభి నవ్వుతుంది. పర్సులో డబ్బులు ఉన్నయ్ తీసుకో అని చెప్తాడు. నెక్ట్స్ సీన్లో ప్రకాశ్ ను దీపక్ హోటల్ కు తీసుకెళ్తాడు. అక్కడ చేపల కూర గురించి ప్రకాశ్ తో గొడవ పడుతుంటే ఇది ప్రియ భర్త హోటల్ అని చెప్తాడు. వాల్ల గురించి ఆలోచించకు అని ఎంత చెప్పిన వినవు కదా అని ప్రకాశ్ వెళ్తాడు. కీస్ మరిచిపోయినా అని ప్రియ ఇంటి తాళం తీసుకుంటాడు.
తరువాత ప్రియ ఇంటి తాళం గురించి భర్తతో గొడవపడుతుంటే, మను ప్రియ ఇంటికి వెళ్తాడు. ఇల్లును చూసి బాధ పడుతాడు. ఇలాంటి ఇంట్లో ఎలా ఉంటున్నావు ప్రియ అనుకుంటాడు. అన్ని వస్తువులను చూస్తాడు. ట్యాప్ లీక్ అవుతుంటే దాన్ని సరి చేస్తాడు. తరువాత వాల్లు హ్యాప్పిగా ఉన్న మూమెంట్స్ ను కల గంటాడు. అదే సమయంలో ప్రియ తన కొడుకు పునిత్ తో ఇంటికి వస్తుంది. అదే సమయంలో మను బయటకు రావడం చూసి ఒక అతను తరుముకుంటూ వెళ్తాడు. ఎవర్రా నువ్వు అని అతను మనును గుర్తు పడుతాడు. అతను ప్రియ తమ్ముడు వినోద్.
ఇద్దరు మాట్లాడుకుంటారు. ప్రియ, దీపక్ ఇద్దరు బాగున్నారు అని వాళ్లకు ఒక బాబు కూడా ఉన్నట్లు వినోద్ చెప్తాడు. వాళ్ల బావ హోటల్ బిజినెస్ చాలా బాగా నడిచేదని కోవిడ్ వళ్ల తను నష్టపోయినట్లు దీపక్ చెప్తుంటాడు. వినోద్ తో మాట్లాడిన తరువాత మను దీపక్ ను కలుస్తాడు. వాళ్లు హ్యప్పిగా ఉన్నారు అని వినోద్ అంటాడు. అయితే తాను పాట మానేసిందని చెప్తాడు. తరువాత దీపక్ తో మను మందుకొడుతుంటాడు. ఇంకోసారి అక్కడికి రావద్దు అని వినోద్ అంటాడు. అదే సమయంలో ప్రకాశ్ కు పరిచయం చేస్తాడు. నువ్వు మారవు అని ప్రకాశ్ కొప్పడుతాడు. తరువాత దీపక్ ను ఒక గోతిలో తోసేస్తాడు. కొంత దూరం వెళ్లిన తరువాత తాను చేసింది కరెక్ట్ కాదని దీపక్ ను తీసుకొని ఆసుపత్రిలో చేర్పిస్తాడు.
అక్కడికి ప్రియ వస్తుంది. వెళ్లిపోదాం పదా అంటే ఎందుకు వెళ్లడం తన భర్త కోసం ఎలా పరుగెత్తుకుంటూ వస్తుందో చూడు అని ప్రకాశ్ అంటాడు. మీ ఇద్దరి కథ ముగిసిపోయింది వదిలేయ్ అని ప్రకాశ్ అంటాడు. లేదు తాను నాకు ఇంకా గుర్తుకు వస్తుంది. తను సింగర్ కావాలని కలకన్నది, నా వలనే పాడటం మానేసింది అని మను ఎమోషనల్ అవుతాడు. తరువాత ప్రియ, మను ఇద్దరు కలిసున్నప్పుడు సంఘటనలు గుర్తు చేసుకుంటాడు.
నెక్ట్స్ సీన్లో ప్రియను ఫాలో అవుతూ వెనకాలే వెళ్తుంటే ప్రియ సడెన్ గా వెనక్కి వచ్చి చూస్తుంది. కట్ చేస్తే ఇద్దరు కలిసి ఒక హోటల్ లో కూర్చిని మాట్లాడుకుంటారు. చేతులు కలుపుకునే లోపే టీ అని బేరర్ వస్తాడు. వైఫ్, పిల్లల గురించి మనును ప్రియ అడుగుతుంది. భార్య పేరు సురభి అని చెబుతాడు. తన భర్త పేరు దీపక్, కొడుకు పేరు పునిత్ అని చెబుతుంది. తరువాత ఇద్దరు ఎమోషనల్ అవుతారు. తను వెళ్తా అని మను చేతులు పట్టుకొని మనం ఇక కలువద్దు అని చెబుతుంది. అక్కడి నుంచి వెల్లిపోతుంది. మనుకు ఏదో సంకెళ్లు వేసి బంధించినట్లు అని పిస్తుంది. తరువాత క్యాసెట్ వింటూ ఆలోచిస్తాడు.
తరువాత సీన్లో చీకట్లో ఉన్న ప్రియ జీవితంలోకి వెలుగులు నింపెలా ఇంటికి అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు కట్ చేస్తాడు. ఇంట్లోకి వెలుతురు రావడం చూసి ప్రియ సంతోష పడుతుంది. నెక్ట్స్ సీన్లో పునిత్ తో ఉప్మ తింటుంటే మను మాట్లాడుతాడు. తనకు పెట్టవా అని అడిగి మను తింటాడు. మరో సీన్లో సురభిని పిలిచి డబ్బులు ఇస్తాడు. తాను సంతోషపడుతుంది. ప్రియ బ్లూ కలర్ దారాన్ని చూసి తన బైక్ ను బాగుచేయాలనుకుంటుంది. తనకు పాటపై ఇష్టం పెరగాలని మ్యూజిక్ బాక్స్ పెడుతాడు మను. వినోద్ కు చెప్పి హెడ్ ఫోన్స్ గిఫ్ట్ ఇస్తాడు.
నెక్ట్స్ సీన్లో మను బార్లో దీపక్ తో మాట్లాడుతుండగా ఒకరు వస్తారు. అతన్ని చూసి దీపక్ బయపడడం మను చూస్తాడు. మరో సీన్లో పునిత్ ను ప్రియ కొట్టడం మను చూస్తాడు. ఎందుకు అని అడిగితే మా నాన్న డబ్బులు తీసుకెళ్లాడు. నాకు సైకిల్ కొనివ్వను అని కొట్టింది అని చెప్తాడు. నేను కొనిపించనా అంటే వద్దు అని పుతిన్ అంటాడు. దాంతో అతని ఎగ్జ్ బిషన్ పాసులు ఇచ్చి అక్కడికి వెళ్లమని చెప్తాడు. ఇదే విషయాన్ని తన తల్లితో చెప్తాడు పునిత్. కట్ చేస్తే మను, సురభితో కలిసి ఎగ్జ్ బిషన్ కు వెళ్తాడు. అక్కడ ప్రియ తన కొడుకుతో సంతోషంగా ఉంటుంది. అదే సమయంలో దీపక్ కొత్త నెంబర్ నుంచి ఫోన్ చేస్తాడు. ఆ నెంబర్ ఒక మస్సాజ్ పార్లల్ నెంబర్ అని మను తెలుసుకుంటాడు.
తరువాత సురభి మనుకు ఒక టీ షర్ట్ గిఫ్ట్ ఇస్తుంది. తరువాత దీపక్ ఎలాంటి వాడో తెలుసుకోమని మను చెప్తాడు. దాంతో సురభి హోటల్ కు వెళ్లి తనతో తప్పుగా నడుచుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ దీపక్ సైలెంట్ గా ఉంటాడు. ఇదే విషయాన్ని మనుకు ఫోన్ చేసి చెప్తుంది. తరువాత సురభి ఎమోషనల్ అవుతుంది. మను అలా చేసినందుకు ఫీల్ అవుతుంది. మను ఎంత ఫోన్ ట్రై చేసినా సురభి ఫోన్ లిఫ్ట్ చేయదు. అదే సమయంలో డబ్బులు కోసం కొందరు వచ్చి గొడవ చేస్తారు ప్రియ ఇంటి దగ్గర. ఈ విషయం మనుకు తెలిసి కోపం వస్తుంది. ఇంటర్ మిషన్ అవుతుంది.
తరువాత సీన్లో దీపక్ దే తప్పు అనుకొని అతనికి విషం పోస్తాడు. కానీ దీపక్ తన భార్యపై చూపించే ప్రేమను, తన నిజాయితీని చూసి గ్లాస్ మారుస్తాడు. తనకు అప్పు ఉందని చెప్తాడు. తరువాత ఆ మందును కింద పోస్తాడు. బాధ పడుతాడు. తరువాత ప్రియ లైఫ్ ఎలాగైనా సెట్ చేయాలని అనుకుంటాడు. దానికోసం వాళ్ల పాత ఓనర్ దగ్గరకు వెళ్లే కంపేనీలో రానివ్వరు. మరో సీన్లో ప్రభు వచ్చి మను అనే వ్యక్తి వాల్లకు తెలియదు అని లోపలికి అలో చేయకండి అని చెప్తాడు. తరువాత ఓనర్ కారు ఎదురుగా నిలబడుతాడు మను, అతను ఒక కాస్ట్లి వాచ్ ఇచ్చి పంపిస్తాడు. అదే విషయాన్ని ప్రకాశ్ కు చెప్తాడు మను.
తరువాత సీన్లో దాన్ని మార్చి డబ్బలు చేసుకునే క్రమంలో సోము కనిపిస్తాడు. మనును మాట్లాడుతా అంటే ప్రకాశ్ అతన్ని తీసుకెళ్తాడు. సోము చేవు వినపడకపోవడానికి కారణం మనున అని సోముకు గుర్తుకు వస్తుంది. కోపం పెంచుకుంటాడు. తరువాత ప్రకాశ్ డబ్బులు తీసుకొని ప్రియ ఇల్లును చూసే రైల్వే బోగికి వెళ్తాడు. తరువాత ఆ డబ్బులను ఇవ్వాలని ప్రకాశ్ ను అడుగుతాడు. తరువాత వినోద్ తో విషయం చెప్పి డబ్బులు ఇవ్వాలని కన్విన్స్ చేస్తాడు.
వినోద్ వెళ్లి వాళ్ల బావతో ఒప్పిస్తాడు. మంగళూరుకు వెళ్లాలని చెప్తాడు. ప్రియ నవ్వుతుంది. తరువాత ఎనిమిది లక్షలు బ్యాలెన్స్ అమౌంట్ ఇచ్చి మిగితా డబ్బులు రెండు నెలల్లో ఇస్తాను అని ప్రకాశ్ చెప్పి దీపక్ తో సైన్ చేయిస్తాడు. తరువాత ప్రియ ఆనందంగా ఉండడం మను చూసి సంతోషపడుతాడు. నెక్ట్స్ సీన్లో పునిత్ కోసం సైకిల్ కొంటారు. తరువాత సురభికి ఫోన్ చేస్తాడు మను, లిఫ్ట్ చేయదు. తరువాత సురభి వచ్చి మను పక్కన కూర్చుంటుంది. సారీ చెప్తాడు. సురభి చేయి పట్టుకుంటాడు.
నెక్ట్స్ సీన్లో ప్రియ సరకులు తీసుకొని వస్తుంటే కుక్క అడ్డం వస్తుంది. దాన్ని చూసి ప్రియ భయపడుతుంది. అది మను చూస్తాడు. మరో సీన్లో సోము మను నెంబర్ తీసుకొని ఫోన్ చేస్తాడు. మనును రెచ్చగొట్టాలని చూస్తాడు. కానీ మనునే సోమును రెచ్చ గొడుతాడు. నెక్ట్స్ కుక్కకు మత్తు కలిపుతాడు మను. నెక్ట్స్ ప్రియ వచ్చే సమయానికి కుక్క ఉండదు.
నెక్ట్స్ సీన్లో సోము మనుషులు మనును ఫాలో అవుతారు. అది మను గమనించి వాల్ల దగ్గరకు వచ్చి సిగరేట్ ముట్టించుకొని వెళ్తాడు. తరువాత సోము వాల్లను తిడుతాడు. మను కనిపించినా ఏం పీకలేకపోయారు అని తిడుతాడు. తరువాత ప్రియను చూసే రైల్ బోగి దగ్గర సోము మనుషి కాళి కూడా ఉంటాడు. ప్రియ కత్తిలా ఉంది కదా అని అక్కడి నుంచి తప్పించుకొని వెల్తాడు. అదే విషయాన్ని సోముకు చెప్పేలోగ అక్కడి మను వస్తాడు. కట్ చేస్తే కాళి బ్రిడ్జికి ఉరిపోసుకుంటాడు. అక్కడికి సోము వచ్చి చూస్తాడు. డ్యాన్స్ చేస్తాడు.
మరో సీన్లో ప్రియను ఇల్లు కాలి చేయించాలని వాళ్ల ఓనర్ కు డబ్బులు ఇస్తాడు మను. కట్ చేస్తే మను ఒక ఇళ్లును చూస్తాడు. అక్కడే ప్రియ వస్తుంది. పైన సంగీతం వినిపిస్తుంది. తనలో పాడాలనే కొరిక పుడుతుందని మను ఆ ఇంటినే ఓకే చేస్తాడు. తరువాత సోము మనును వెంటాడుతుంటాడు. మను సురభితో ఉన్నప్పుడు సోము ఫోను చేసి కాళి పెద్ద కర్మకు రా అని చెప్తాడు. కట్ చేస్తే మను వెళ్తాడు. అక్కడే సోమును రెచ్చగొట్టినట్లు మాట్లాడుతాడు. సురభినే మను గర్ల్ ఫ్రెండ్ అనుకోని సోము సురభిని ఇబ్బంది పెట్టడానికి తన దగ్గరకు వెళ్తాడు. అంతలో అక్కడికి మను వచ్చి సురభి కాపాడుతాడు. సోము గన్ తీసుకొని డబ్బులు విసిరేసి వెళ్లిపోతాడు. మను సురభిని హగ్ చేసుకుంటాడు. సోము గురించి చెబుతుంటే నేను అడగలేదు అని సురభి అంటుంది.
సురభిని తీసుకొని మను ఒక కొత్త ఇంటికి వస్తాడు. అక్కడ క్యాసెట్ తీసి దాచిపెడుతాడు. అదే సమయంలో హోటల్ పనులు మొదలుపెట్టామని డబ్బులు అయిపోయాయని వినోద్ ఫోన్ చేసి చెప్తాడు. దాంతో ప్రీతును కలవడానికి మను వస్తాడు. అక్కడ ప్రీతు కార్లోకి కుక్కను పంపిస్తాడు. అది ప్రీతును గట్టిగా కరుస్తుంది. హాస్పటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే అక్కడికి మను వచ్చి వాళ్ల మేడమ్ తో మాట్లాడుతాడు. మను బ్యాంక్ డిటైల్స్ ఇచ్చి డబ్బులు కావాలని, ఇంకో పని చేయమని చెప్తాడు. కట్ చేస్తే సోము జైల్ కు వెళ్తాడు. ప్రభును ఒక చోట బంధి చేస్తాడు. ప్రియ ఫ్యామిలీని సెట్ చేస్తాడు. తరువాత సురభితో మను సంతోషంగా ఉంటాడు.
మ్యూజిక్ ఆడిషన్ ను తన కొడుకుతో ఇంటికి పంపిస్తాడు. నెక్ట్స్ దీపక్ హోటల్ ఓపెన్ చేస్తాడు. వినోద్ గుమ్మడి కాయ కొట్టి ఓపెన్ చేస్తాడు. అందరూ సంతోషంగా ఉంటారు. ప్రియా సంతోషంగా ఉందని చెప్తుండగా సురభి వచ్చి టీ కావాలా అని అడుగుతుంది. తరువాత ప్రభును వదిలేయమని ప్రకాశ్ చెప్తాడు. తరువాత స్వీట్స్ ఇచ్చి హోటల్ ఓపెన్ అయిందని చెప్తాడు. ప్రభు ఏడుస్తాడు. నా తప్పు నాకు తెలిసి వచ్చిందని ఏడుస్తాడు. నన్ను వదిలయేమని బతిమిలాడుతాడు. ప్రియ పాడడం స్టార్ చేస్తే వదిలేస్తా అని మను అంటాడు.
ప్రియ బస్సు కోసం వెయిట్ చేస్తుంటే మను అక్కడ ఆంధులతో పాటల ప్రోగ్రామ్ అరెంజ్ చేస్తాడు. అది చూసి ప్రియలో పాడలన్న కోరిక పుడుతుంది. అది మను చూస్తాడు. తరువాత సురభికి మెడికల్ సీట్ అడ్మిషన్ తీసుకొని వస్తాడు. అదే సమయంలో దీపక్ ఫోన్ చేస్తాడు. సురభికి చెప్పి మను బయటకు వెళ్తాడు. మను వెళ్లేప్పుడు పైన పెట్టెను సురభి చూస్తుంది. అదే సమయంలో మను దీపక్ దగ్గరకు వెళ్తాడు. అక్కడ ప్రకాశ్ ఉంటాడు. ఇతను అబద్దం చెప్పి నాకు డబ్బులు ఇచ్చాడు అని, ఏ ఉద్దేశంతో నాకు హెల్ప్ చేశాడో అని దీపక్ అంటాడు. తనను ఒక ప్లేస్ కు తీసుకెల్తే తానే చెప్తాడు అని ప్రభు ఉన్న ప్లేస్ కు తీసుకెళ్తాడు మను. ఆ ప్లేస్ చూసి దీపక్ భయపడుతాడు. మను నిజం చెప్తాడు. ప్రియకు తనకు ఉన్న రిలేషన్ గురించి చెప్తాడు. దీపక్ అయిష్టంతో ఓకే అంటాడు.
మరో సీన్లో మను ఇంటికి రాగానే ప్రియ క్యాసెట్లు అన్ని తగలబెడుతుంది. మనును తిడుతుంది సురభి, తనను తిట్టి బట్టల బయట విసిరేసి సురభిని బయటకు వెళ్లిపో అంటాడు. మరో సీన్లో ప్రియ మ్యూజిక్ వింటుంటే దీపక్ వింటాడు. తరువాత ప్రియ చీరలు చూపిస్తుంటే సురభికి ఏం నచ్చలేదని వెళ్తుంది. సోము జైల్ నుంచి బయటకు వస్తాడు. మేకను నరికి బిర్యాని చేసి తింటారు. మను దగ్గర ఉన్న అమ్మాయిని తీసుకురా అని విలన్లను పంపిస్తాడు. అదే సమయంలో సురభి మను గురించి ఆలోచించుకుంటూ, ఏడుచుకుంటు సోముకు దొరికిపోతుంది.
తరువాత ప్రియను పాడమని, ఆడిషన్స్ కు వెళ్లమని దీపక్ చెప్తాడు. ప్రియ ఆడిషన్స్ కు వెళ్తుంది. ప్రియ పాడుతే నువ్వు ఏం చేస్తాము అని ప్రభు అంటాడు. నేను సముద్రం దగ్గరకు వెళ్తా నిన్ను వదిలేస్తా అని అంటాడు. అదే సమయంలో సోము ఫోన్ చేస్తాడు. తరువాత ప్రకాశ్ కు ఫోన్ చేస్తాడు మను. ప్రియ ఆడిషన్స్ జరిగే చోటుకు వెళ్లి తనను చూసి సోము దగ్గరకు వెళ్తాడు. అక్కడ అందరితో ఫైట్ చేస్తాడు. సురభి ఎక్కడ అని అందరిని కొడుతాడు. సోము తన బాయ్స్ ను పిలుస్తుంటాడు. చాలా మంది వస్తూనే ఉంటారు.
మను కత్తులతో అందరిని పొడుస్తుంటాడు. మనును కూడా కత్తితితో పొడుస్తారు. సోము భయపడుతాడు. మను అందరిని నరుక్కుంటూ సురభికోసం వస్తాడు. మరో వైపు ప్రియ పాడడానికి రెడీ అవుతుంది. మరో వైపు మను ఫైట్ చేస్తుంటాడు. ప్రియ పాడడానికి స్టేజ్ ఎక్కుతుంది. మను ఫైట్ చేస్తూ సురభి ఉన్న గదికి వెళ్తాడు. ప్రియ పాట స్టార్ట్ చేసి పాడలేక ఏడుస్తుంది. సోము గన్ తో మనును కాలుస్తాడు. సురభి దగ్గరకు వచ్చి ఏదో అంటుంటే మను సోమును కత్తితో పొడిచి చంపేస్తాడు.
ప్రియ ఇంటికి వచ్చి డోర్ వేసుకుంటుంది. ప్రకాశ్ కు మను లెటర్ పంపిస్తాడు. అకౌంట్లో డబ్బులను ఏం చేయాలొ తెలుసుగా అని మను రాస్తాడు. సురభి వచ్చి డాక్టర్ ను తీసుకోస్తా అని వెళ్తుంది. మనుకు ప్రియ పాడినట్లు గుర్తుకు వస్తుంది. మను లేచి నడుచుకుంటూ అలా.. సముద్రంలోకి వెళ్లి, అక్కడే ప్రియను కలిసి సముద్రంలో కలిసిపోతాడు. మను చనిపోతాడు. దీపక్ హోటల్ బాగానే నడుస్తుంది. ప్రకాశ్ క్యాబ్ కొనుక్కొని సెటిల్ అవుతాడు. సురభి మెడికల్ ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతుంది. ఇది సప్తసాగరాలు దాటి సైడ్ బి.