TG: హైదరాబాద్ కేంద్రంగా ఫార్మా సర్వీసులు అందిస్తున్న అరబిందో ఫార్మా శ్వాసకోశ సంబంధిత ఔషధాల అభివృద్ధికి, విక్రయాలకు గ్లోబల్ ఫార్మాస్యూటికల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ అంతర్జాతీయ ఫార్మా సంస్థ పేరు మాత్రం కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. ఒప్పందంలో భాగంగా శ్వాస సంబంధిత ఉత్పత్తుల అభివృద్ధి, కమర్షియలైజేషన్ను చేయనున్నట్లు అరబిందో ఫార్మా తెలిపింది.