TG: సమగ్ర వైద్య పరీక్షలతోనే వ్యాధులను నిర్ధారించి చికిత్సతో నయం చేయొచ్చని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. అందరికీ అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణ ద్వారానే వ్యాధులను గుర్తించవచ్చన్నారు. రెగ్యులర్ హెల్త్ స్క్రీనింగ్‌ల ప్రాముఖ్యతను గవర్నర్ వివరించారు. అల్లోపతి, ఆయుర్వేదం, డెంటల్, పారా మెడికల్ బృందాలకు చెందిన ప్రత్యేక వైద్యులు రాజ్ భవన్ సిబ్బందికి వైద్య పరీక్షలను నిర్వహించారు.