TG: సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ అధిష్ఠానంతో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో అధికారం చేపట్టి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని ఏఐసీసీ పెద్దలను రేవంత్ రెడ్డి కోరనున్నట్లు సమాచారం. సెక్రటేరియట్లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు సభకు హాజరుకావాలని రాహుల్ గాంధీని కోరనున్నట్లు తెలుస్తోంది.