TG: రాష్ట్రంలో భారీగా విద్యుత్ వినియోగం తగ్గింది. చలికాలం కావడంతో డిమాండ్ తగ్గింది. గతేడాది ఇదే రోజు SPDCL, NPDCL పరిధిలో మొత్తం 8,426 మెగావాట్ల వినియోగం జరిగింది. నిన్న సాయంత్రం 7:54 గంటల వరకు ఈ వినియోగం 6,650 మెగావాట్లుగా ఉంది. కాగా, SPDCL పరిధిలో గతేడాది 6,118 మెగావాట్ల వినియోగం జరగ్గా.. ఆదివారం నాటికి అది 4,990 మెగావాట్లుగా ఉంది. NPDCL పరిధిలో గతేడాది 2107 మెగావాట్లు ఉండగా ఆదివారం నాటికి 1552 మెగావాట్లుగా నమోదైంది.