AP: పారిశ్రామిక వ్యాపార వేత్త అదానీపై అమెరికాలో లంచం కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. అయితే అదానీ వ్యవహారంపై సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. అలాగే అదానీ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. అదానీని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆ దమ్ము ప్రధాని మోదీకి ఉందా? అని సవాల్ విసిరారు. ఈ కేసులో అమెరికా ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుందా? లేక అదానీకి మద్దతుగా మోదీ అడ్డుపడతారా? అన్నది వేచి చూడాలన్నారు.