TG: ఖమ్మం జిల్లాలో ఘరానా మోసం వెలుగు చూసింది. కడియాలకు బంగారు పూత పూసి రూ. లక్షల్లో బురిడీ కొట్టించిన ఘటన వెలుగు చూసింది. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి ఖమ్మంలోని తన బావమరిదితో ఈ మోసానికి పాల్పడ్డాడు. నగరంలోని ఒక్క DCCB బ్యాంకులోనే 29 మంది పేర్ల మీద దాదాపు రూ. 30 లక్షలకు పైగా రుణాలు తీసుకున్నట్లు తేలింది. 30 గ్రాముల కడియానికి 3 లేదా 4 గ్రాముల బంగారు పూత పూసి మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.