»Ktr Revanth Reddy Is Not The Chief Minister Chosen By The People
KTR: ప్రజలు ఎంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు
కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో అన్నారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7500 కోట్లు రైతులు ఖాతాల్లో కేసీఆర్ వేశారు.
KTR: కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల నియోజకవర్గ సమావేశంలో అన్నారు. రూ. 2 లక్షల రైతు రుణమాఫీ చేయలేదు. రైతుబంధు కింద వారం రోజుల్లోనే రూ. 7500 కోట్లు రైతులు ఖాతాల్లో కేసీఆర్ వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం మాత్రమే పోయింది. పోరాట పటిమ కాదు. ప్రజల పక్షాన ప్రశ్నించడంలో కేసీఆర్ కంటే పదునైన గొంతు దేశంలో లేదన్నారు.
ప్రజలు ఎంచుకున్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు. ఢిల్లీ మేనేజ్మెంట్ కోటా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అసలు కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ రాకపోతే సీఎం, డిప్యూటీ సీఎం పదవులు మీకు దక్కేవా? అని కేటీఆర్ అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటే వదిలిపెట్టేది లేదని కేటీఆర్ హెచ్చరించారు. అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ కూడా నమ్మలేదు అని కేటీఆర్ తెలిపారు. డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేశారు. కేసీఆర్ చెప్పిందే నిజమైందని ప్రజలు భావిస్తున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల బతుకులు ఆగం అయ్యాయి. ఫ్రీ బస్సు పథకంతో బస్సుల్లో యుద్ధాలు జరుగుతున్నాయి.