»Red Sea The Houthis Are Once Again Angry In The Red Sea
Red Sea: ఎర్రసముద్రంలో రెచ్చిపోయిన హౌతీలు
ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. తమపై దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్ నౌకలపై ఒకేసారి దాడులు చేశారు. రష్యా నుంచి చమురు తీసుకొస్తున్న బ్రిటన్ నౌక మార్లిన్ లువాండా మాత్రం హౌతీల నుంచి తప్పించుకోలేకపోయింది. క్షిపణులు నేరుగా తాకడంతో ఇంధన ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి.
Red Sea: ఎర్రసముద్రంలో హౌతీలు మరోసారి రెచ్చిపోయారు. తమపై దాడులు చేస్తున్న అమెరికా, బ్రిటన్ నౌకలపై ఒకేసారి దాడులు చేశారు. అమెరికా యుద్ధనౌక డిస్ట్రాయర్ కార్నీపై యెమెన్ తిరుగుబాటుదారులు యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణి ప్రయోగించారు. దీన్ని మధ్యలోనే కార్నీ అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే రష్యా నుంచి చమురు తీసుకొస్తున్న బ్రిటన్ నౌక మార్లిన్ లువాండా మాత్రం హౌతీల నుంచి తప్పించుకోలేకపోయింది. క్షిపణులు నేరుగా తాకడంతో ఇంధన ట్యాంకర్లు మంటల్లో చిక్కుకున్నాయి. తమపై అమెరికా, బ్రిటన్ దేశాలు ఇటీవల చేసిన సంయుక్త దాడులకు ప్రతీకారంగానే తాజా దాడులు నిర్వహించామని హౌతీలు తెలిపారు.
గాజాపై ఇజ్రాయెల్ యుద్ధం ఆపేంతవరకు తమ దాడులు కొనసాగుతూనే ఉంటాయని ప్రకటించారు. దాడికి గురైన బ్రిటన్ నౌకలో 22 మంది భారతీయులు, ఇద్దరు శ్రీలంక దేశస్థులు ఉన్నట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న ఈ నౌకను రక్షించేందుకు ఐఎన్ఎస్ విశాఖపట్నం రంగంలోకి దిగింది. అత్యవసర సాయం అందించాలని మార్లిన్ లువాండా నుంచి వచ్చిన సందేశానికి తాము స్పందించామని శనివారం భారత నౌకాదళ అధికారులు తెలిపారు. దాదాపు ఆరుగంటల పాటు శ్రమించి, మంటలను ఆర్పి అందులోని సిబ్బందిని రక్షించినట్లు వారు వివరించారు.
ఇటీవల కాలంలో అరేబియా, ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై జరుగుతున్న వరుస దాడులు నేపథ్యంలో అప్రమత్తమైన భారత్ తన సుముద్ర గస్తీని భారీస్థాయిలో పెంచింది. దాడులకు గురవుతున్న విదేశీ నౌకలకు అండగా నిలుస్తోంది. ఈ నెల 17న ఏడెన్ జలసంధిలో డ్రోన్ దాడికి గురైన ఎంవీ జెన్కో పికార్డే పంపిన అత్యవసర సందేశానికి కూడా ఐఎన్ఎస్ విశాఖపట్నం స్పందించి.. అందులో 22 మందిని సిబ్బందిని రక్షించింది. అంతకుముందు ఎంవీ లీలా నార్ఫోక్ను సోమాలియా సముద్ర దొంగలు హైజాక్ చేసినపుడూ భారత నౌకాదళం రంగంలోకి దిగింది. డిసెంబరులో డ్రోన్ దాడికి గురైన ఎంవీ చెమ్ ప్లుటో నౌకలో 21 మంది భారతీయులనూ ఆదుకుంది.