»Sania Mirza Sanias First Post After Her Divorce With Shoaib
Sania Mirza: షోయబ్‌తో విడాకుల తర్వాత సానియా తొలి పోస్ట్
భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. అయితే షోయబ్ వివాహం తర్వాత సానియా తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
Sania Mirza: భారత టెన్నిస్ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా భర్త మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి ముగింపు పలికిన సంగతి తెలిసిందే. ఇటీవల షోయబ్ పాటి నటి సనా జావెద్‌ను వివాహం చేసుకోవడంతో సానియా, షోయబ్ విడాకులు తీసుకున్నారని తెలిసింది. అయితే షోయబ్ వివాహం తర్వాత సానియా తొలిసారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. అద్దంలో తనని తాను చూసుకుంటున్న చిత్రాన్ని షేర్ చేస్తూ.. రిఫ్లెక్ట్ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే విడాకులు లేదా షోయబ్ మూడో వివాహం గురించి ప్రస్తావించలేదు. సానియా తనని తాను సమీక్షించుకున్నట్లు అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
మాలిక్‌కు ఇది మూడో వివాహం కాగా, సనాకు రెండోది. 2010లో ఆయేషా సిద్ధిఖీకి విడాకులు ఇచ్చిన షోయబ్ అదే ఏడాది హైదరాబాదీ సానియాను రెండో పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికి 2018లో కొడుకు ఇజాన్ పుట్టాడు. అయితే గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడటంతో దూరంగా ఉంటున్నారు. కొన్ని రోజుల క్రితం షోయబ్..ఇన్‌స్టాగ్రామ్‌లో సానియాను అన్‌ఫాలో చేయడం ఇందుకు మరింత బలాన్ని ఇచ్చింది.