Congress: పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(జగ్గారెడ్డి) హడావిడిగా నేడు ఢిల్లీ(Delhi)కి పయనం అయ్యారు. మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)ని ఆయన స్వగృహంలో కలిసిన విషయం తెలిసిందే. దాదాపు 20 నిమిషాలు సుధీర్ఘంగా చర్చించారు. సీఎంతో భేటీ అనంతరం మీడియాకు విషయం చెప్పడానికి జగ్గారెడ్డి నిరాకరించారు. దీంతో ఏదో తీవ్ర చర్చ అయి ఉంటుందని అందరూ భావించారు. ఈ నేపథ్యంలో జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లడంతో పార్టీ వర్గాల్లో చర్చ మొదలైంది. జగ్గారెడ్డి ఎమ్మెల్సీ లేదా పీసీసీ అధ్యక్షుడి పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. మరో వైపు మెదక్ ఎంపీగా ఆయన కుమార్తే జయారెడ్డి, లేదా ఆయన సతీమణి సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు నిర్మల పోటీ చేస్తారనే ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. వీరి టికెట్ కోసం వేళ్లాడా లేదా మరే విషయంపై హస్తినాకు వెళ్లాడని చర్చసాగుతోంది. ఆయన ఢిల్లీ పర్యటనలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.