అన్ని అనుకున్నట్టుగా జరిగి ఉంటే.. ఈ పాటికి ప్రభాస్ 'కల్కి' మూవీ హవా నడుస్తుండేది. కానీ అనుకోకుండా సంక్రాంతి నుంచి వెనక్కి వెళ్లింది కల్కి. అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కల్కి రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది.
Kalki: ముందుగా అనుకున్న ప్రకారం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటేడ్ మూవీ కల్కి రిలీజ్ కావాల్సి ఉంది. మేకర్స్ దీనిపై అఫిషీయల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కానీ కల్కి మళ్లీ వాయిదా పడింది. అయితే.. ఈ వారంలోనే కల్కి కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. కల్కి రిలీజ్ కావాల్సిన డేట్ జనవరి 12న ఈ కొత్త డేట్ అనౌన్స్మెంట్ ఉండే ఛాన్స్ ఉంది. మే 9న ‘కల్కి’ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టుగా చాలా రోజులుగా వార్తలు వస్తునే ఉన్నాయి.
కల్కి నిర్మాణ సంస్థ వైజయంతి బ్యానర్‌కి మే 9వ తేదికి తరాల అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఇండస్ట్రీ హిట్ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ఆ రోజే విడుదల అయ్యింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన మోడరన్ క్లాసిక్ ‘మహానటి’ కూడా మే 9నే రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకూ మే 9న వైజయంతి మూవీస్ నుంచి వచ్చి సినిమాలు నెవర్ బిఫోర్ హిట్స్‌గా నిలిచాయి. ఈ సెంటిమెంట్‌తోనే 2024 మే 9న కల్కిని రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఈ వారంలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుందని అంటున్నారు.
ఇక నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరో 20 రోజులు షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ఆ తర్వాత గుమ్మడికాయ కొట్టేసి పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పై ఫోకస్ చేయనుంది చిత్ర యూనిట్. మరి కల్కి రిలీజ్ ఎప్పుడుంటుందో చూడాలి.