KCR: బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు ముందు బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కలిసి తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.
బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతగా (BRSLP leader) మాజీ సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ సీనియర్ నాయకులు కే.కేశవరావు అధ్యక్షతన శనివారం ఉదయం సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి (pocharam Srinivas Reddy) ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులకు కీలక విషయాలను సూచించారు. బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష నేతగా పార్టీ అధినేత కేసీఆరే ఉండాలని ఏకగ్రీవ తీర్మానం ప్రవేశపెట్టారు.
బీఆర్ఎస్ఎల్పీ నేతగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు గారి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. కేసీఆర్ గారి పేరును ప్రతిపాదించగా మాజీ మంత్రులు శ్రీనివాస్ యాదవ్,… pic.twitter.com/mWCeGG2hIN
పోచారం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఎమ్మెల్యేలంతా బలపరిచారు. ఈ తరుణంలో బీఆర్ఎస్ఎల్పీ లీడర్‌గా పార్టీ అధినేత కేసీఆర్ (KCR)ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తెలంగాణ రాష్ట్ర మూడో అసెంబ్లీ మొదటి సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ప్రజాప్రతినిధులు సమావేశమై పలు విషయాలపై చర్చించారు.
అసెంబ్లీ సమావేశాల్లో (Assembly Meetings) నేతలు చేపట్టాల్సిన విధివిధానాలు, అభ్యర్థుల ప్రవర్తనా నియమావళి, సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహం వంటి అంశాలపై బీఆర్ఎస్ (BRS) నేతలు చర్చలు జరిపారు. సమావేశం తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీ ముందు ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు.