»Sandeep Reddy Vanga Comments About National Awards
National Awardsపై సందీప్ రెడ్డి వంగా హాట్ కామెంట్స్
జాతీయ అవార్డులపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు మన దర్శక నిర్మాతలు అవార్డుల కోసం ఆప్లై చేశారా అనే సందేహాం వ్యక్తం చేశారు. తన మూవీ యానిమల్ ప్రమోషన్స్‌లో కామెంట్స్ చేశారు.
Sandeep Reddy Vanga Comments About National Awards
Sandeep Reddy Vanga: యానిమల్ మూవీ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) బిజీగా ఉన్నారు. ప్రి రిలీజ్ ఫంక్షన్ మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వరసగా టీవీ చానెళ్లకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ క్రమంలో నేషనల్ అవార్డ్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
అల్లు అర్జున్‌కు 69వ జాతీయ ఉత్తమ నటుడి నేషనల్ అవార్డు రావడం సంతోషం.. 69 ఏళ్లుగా మనవాళ్లకు ఎందుకు రాలేదా అనిపించిందని అన్నారు. లేదంటే మనవాళ్లు జాతీయ అవార్డు కోసం దరఖాస్తు చేశారా అని సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సందేహాం వ్యక్తం చేశారు. తనకు తెలిసినంత వరకు మనవాళ్లు అంతగా పట్టించుకోరని కామెంట్స్ చేశారు.
అల్లు అర్జున్‌కు రావడం ఓకే.. కానీ ఇన్నాళ్లూ ఎందుకు రాలేదని అడిగారు. ఆఫ్లై చేశారా లేదా అనడం కాస్త ఇరుకున పెట్టే అవకాశం ఉంది. దీనిపై కొందరు రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీనిపై దుమారం రేపేందుకు ఛాన్స్ ఉందని క్రిటిక్స్ అంటున్నారు. చక్కగా మూవీ ప్రమోషన్స్‌లో ఉండగా.. ఎందుకు అనవసరంగా జాతీయ అవార్డుల గురించి మాట్లాడటం అని కొందరు అంటున్నారు.
యానిమల్ మూవీ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) రెండో సినిమా. ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. దానిని హిందీలో కబీర్ సింగ్ పేరుతో తెరకెక్కించాడు. అందులో షాహీద్ కపూర్ హీరోగా నటించారు.