Rajkumar Kohli: బాలీవుడ్ వెటరన్ దర్శకుడు రాజ్ కుమార్ కోహ్లీ (Rajkumar Kohli) కన్నుమూశారు. ముంబైలో గల తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో చనిపోయారని వైద్యులు ధృవీకరించారు.
జానీ దుష్మన్, నాగిన్, రాజ్ తిలక్, విరోధి, కహర్ లాంటి హిట్ సినిమాలకు రాజ్ కుమార్ కోహ్లీ (Rajkumar Kohli) దర్శకత్వం వహించారు. 1970 నుంచి 2003 వరకు హిందీ సినిమాలతోపాటు పంజాబీ సినిమాలను కూడా నిర్మించారు. సన్నీ డియోల్, సునీల్ దత్, మిథున్ చక్రవర్తి, అనిల్ కపూర్ లాంటి స్టార్లతో మూవీస్ చేశారు. రాజ్ కుమార్ కోహ్లీ మృతిపై పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.