Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధినేతలు బిజీగా ఉన్నారు. వరస సభలతో హోరెత్తిస్తున్నారు. నిజామాబాద్లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి యాత్రలో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్కు సవాల్ విసిరారు.
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ను చూపించి తాము ఓట్లు అడుగుతాం అని.. కాళేశ్వరం ప్రాజెక్ట్ చూపించి ఓట్లు అడిగే దమ్ము కేసీఆర్కు ఉందా అని ప్రశ్నించారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తాము చూపిస్తామని.. కుంగిన మేడిగడ్డను మీరు చూపించగలరా అని అడిగారు. ఈ అంశంపై కేసీఆర్ తన సవాల్ స్వీకరించాలని కోరారు.
అధికారం చేపట్టిన 100 రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి.. పదేళ్లు గడుస్తోన్న ఇంకా తెరవలేదని రేవంత్ రెడ్డి (Revanth Reddy) మండిపడ్డారు. దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన ఆర్టీసీ కార్మికులను వేధించారని మండిపడ్డారు. మద్ధతు ధర ఇవ్వాలని అడిగిన జొన్న రైతులపై కేసులు పెట్టారని విరుచుకుపడ్డారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయం అని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. 80 సీట్లు గెలిచి.. అధికారం చేపడుతామని అంటున్నారు.