BJP ఒక్క సీటు గెలిస్తే గొప్ప..?: మంత్రి హరీశ్ రావు
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు గెలిస్తే గొప్ప అని మంత్రి హరీశ్ రావు హాట్ కామెంట్స్ చేశారు. ఆ పార్టీ నేతలు మాత్రం అధికారం చేపడుతామని గొప్పలు పోతున్నారని మండిపడ్డారు. గెలిస్తే ఒక సీటు గెలవొచ్చన్నారు.
Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్నారు నేతలు. దుబ్బాకలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తరఫున మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బై పోల్లో గెలిచి, నియోజకవర్గానికి ఏం చేశాడని నిలదీశారు. 2018లో మాదిరిగానే.. 2023లో కూడా బీజేపీ గెలిస్తే.. ఒక్క సీటు గెలుస్తోందని కామెంట్స్ చేశారు మంత్రి హరీశ్ రావు (Harish Rao).
తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపడుతామనే ధీమాలో బీజేపీ ఉందని.. కానీ ఆ పార్టీ ఒక్క సీటు గెలిస్తే గెలవొచ్చని చెప్పారు. లేదంటే అదీ కూడా లేదన్నారు. తమ పార్టీ అధికారం చేపడుతుందనే ధీమాలో ఆ పార్టీ నేతలు ఉన్నారని వివరించారు. రియాల్టీ మాత్రం అదీ కాదన్నారు. దుబ్బాకకు రఘునందన్ రావు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు అని.. స్థానికులను ఉద్దేశించి మాట్లాడారు.
రఘునందన్ రావు ఏమీ చేయకుంటే.. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చొరవ తీసుకుని దుబ్బాకలో అభివృద్ధి పనులు చేశారని గుర్తుచేశారు. ఆ విషయం ఓ సారి గుర్తుచేసుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం ఖాయం అని.. మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి పదవీ చేపడుతారని తెలిపారు.
తమ పార్టీపై అబద్దపు ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు (Harish Rao) మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటలను నమ్మొద్దని కోరారు. లేనిది ఉన్నట్టు బీజేపీ నేతలు మాట్లాడితే.. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కాపీ కొట్టిందని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో వాడే పాటను కూడా కాపీ చేసిందని గుర్తుచేశారు.