»Icc Has Brought A New Rule If The Bowler Does That The Penalty Is 5 Runs
ICC: కొత్త రూల్ తెచ్చిన ఐసీసీ..బౌలర్ అలా చేస్తే 5 పరుగుల పెనాల్టీ!
క్రికెట్ ఆటలో మరో కొత్త రూల్ వచ్చింది. స్టాప్ క్లాక్ విధానంలో ఈ రూల్‌ను ఐసీసీ ప్రవేశపెట్టింది. బౌలింగ్ వేసే సమయంలో ఒక ఓవర్‌కు మరో ఓవర్ మధ్య 60 సెకన్లలోపే సమయం ఉండాలి. అలా 60 సెకన్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే 5 పరుగులు పెనాల్టీ వేయనున్నట్లు ఐసీసీ కొత్త నిబంధనను తీసుకొచ్చింది.
క్రికెట్ (Cricket)లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (International Cricket Council) కొత్త రూల్‌ను (New Rule) తీసుకొచ్చింది. ఈ రూల్ వచ్చే నెల డిసెంబర్ నుంచి అమల్లోకి రానుంది. ఈ రూల్ ప్రకారం..పురుషుల వన్డే, టీ20 సిరీస్‌లల్లో బౌలర్లు మూడోసారి బౌలింగ్ (Bowling) చేసేటప్పుడు 60 సెకన్ల సమయం దాటితే వారికి 5 పరుగుల పెనాల్టీ విధించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఈ కొత్త ‘స్టాప్ క్లాక్’ (Stop clock) విధానం రూల్‌ను డిసెంబర్ నుంచి జరిగే మ్యాచుల్లో వర్తించనున్నట్లు ఐసీసీ (ICC) వెల్లడించింది. ఇది బౌలర్లకు కొంత కష్టతరం కానుంది.
ఇప్పటి వరకూ వైట్ బాల్ క్రికెట్లో ఈ రూల్ లేదు. అయితే వచ్చే నెల డిసెంబర్ నుంచి 2024 ఏప్రిల్ వరకూ ఈ రూల్‌ను అమలు చేయనున్నట్లు ఐసీసీ (ICC) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్ వరకూ ప్రయోగాత్మకంగా మాత్రమే దానిని అమలు చేయనుంది. నేడు అహ్మదాబాద్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ బోర్డు సమావేశం అయ్యింది. ఈ మేరకు పలు కీలక విషయాలపై చర్చించింది. ఓవర్ల మధ్య తీసుకునే సమయాన్ని నియంత్రించడానికి ఈ రూల్‌ను అమలు చేయనున్నట్లు ఐసీసీ నిర్ణయించింది.
ఓవర్ పూర్తయిన వెంటనే మరో ఓవర్‌ను 60 సెకన్లలోపు వేయాల్సి ఉంటుంది. అలా ఒక ఇన్నింగ్స్‌లో మూడోసారి 60 సెకన్లలోపు బౌలింగ్ చేయకుండా ఆలస్యం చేస్తే మాత్రం 5 పరుగుల పెనాల్టీని విధించనున్నట్లు ఐసీసీ వెల్లడించింది. ఈ మధ్యనే వన్డే ప్రపంచ కప్ టోర్నీలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ ఏంజెలో మాథ్యూస్ ‘టైమ్డ్ ఔట్’ (Timed Out) అయ్యాడు. అది తొలి టైమ్డ్ ఔట్ కావడంతో సర్వత్రా దానిపై చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటువంటి రూల్‌ను అమలు చేస్తే మ్యాచ్‌కు మరింత సమయం తగ్గే అవకాశం ఉంది. దీని వల్ల ఆటగాళ్లకు కూడా శ్రమ తగ్గుతుందని ఐసీసీ (ICC) తెలిపింది.