ఇన్ని రోజులు డిలే అయింది కానీ.. ఇక పై నుంచి కాదని అంటున్నారు గుంటూరు కారం మేకర్స్. సూపర్ స్టార్ మహేష్ నటిస్తున్న గుంటూరు కారం సినిమా నుంచి సాలిడ్ అప్డేట్స్ ఇస్తున్నారు. త్వరలో సెకండ్ సింగిల్తోపాటు.. ప్రమోషన్స్ స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు.
Guntur Karam: అతడు, ఖలేజా తర్వాత ముచ్చటగా మూడోసారి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో కలిసి ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. అయితే ఇప్పటి వరకు బుల్లితెరపైనే హిట్ అయిన ఈ కాంబినేషన్.. ఈ సారి బిగ్ స్క్రీన్ పై సెన్సేషన్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న గుంటూరు కారం రిలీజ్ కానుంది. పండగ సీజన్ కాబట్టి.. టాక్‌తో సంబంధం లేకుండా రీజనల్ బాక్సాఫీస్ దగ్గర గుంటూరు కారం భారీ వసూళ్లు అందుకోవడం గ్యారెంటీ. అందుకే.. డిసెంబర్ నుంచే గుంటూరు కారం మంట మొదలుకానుంది. ఇప్పటికే థమన్ ఇచ్చిన దమ్ మసాలా మాస్ బీట్ రిలీజ్ చేసిన మేకర్స్.. ఇప్పుడు సెకండ్ సింగిల్ రిలీజ్‌కు రెడీ అవుతున్నారు.
నెక్స్ట్ వీక్‌లో గుంటూరు కారం సెకండ్ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్టు.. ప్రొడ్యూసర్ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. సినిమాలో మొత్తం నాలుగు పాటలు ఉంటాయని.. నెక్స్ట్ ఇయర్ మొత్తం ఆ సాంగ్స్ వినిపిస్తాయని అన్నారు. సెకండ్ సింగిల్ వచ్చేసి.. మెలోడి సాంగ్ అని తెలుస్తోంది. ఇకపోతే.. డిసెంబర్ వరకు గుంటూరు కారం షూటింగ్ మొత్తం కంప్లీట్ కానుంది. ఆ వెంటనే భారీగా ప్రమోషన్స్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మహేష్ బాబు మాత్రం న్యూ ఇయర్ వెకేషన్‌కి వెళ్లొచ్చిన తర్వాత గుంటూరు కారం ప్రమోషన్స్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ప్రస్తుతానికైతే రామోజీఫిలిం సిటీలో వేసిన మిర్చి యార్డు సెట్లో షూట్ చేస్తున్నారట. మరి గుంటూరు కారం ఘాటు ఎలా ఉంటుందో చూడాలి.