»Congress Party Complaint To Ec Against Minister Ktr
KTRపై ఈసీకి కాంగ్రెస్ ఫిర్యాదు.. ఎందుకంటే..?
మంత్రి కేటీఆర్‌పై కాంగ్రెస్ నేతల బృందం సీఈసీకి కంప్లైంట్ చేసింది. ఎన్నికల నిబంధనలను అతిక్రమించినందున కేటీఆర్‌పై 3 రోజుల ప్రచారం నిషేధం విధించాలని కోరింది.
KTR: సరిగ్గా వారం రోజుల్లో ప్రచార గడువు ముగియనుంది. ప్రధాన పార్టీల నేతలు కాలికి బలపం కట్టుకుని మరి తిరుగుతున్నారు. ఊరు, వాడ, పల్లె, పట్టణం అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతల ప్రచార హోరు పెరిగింది.
మంత్రి కేటీఆర్‌పై (KTR) కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్‌కు కంప్లైంట్ చేసింది. కేటీఆర్ (KTR) ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ప్రభుత్వ భవనాలు, ఇంటర్వ్యూ, న్యూస్ పేపర్లలో తప్పుడు ప్రకటనలు ఇస్తున్నారని ప్రస్తావించింది. రూల్స్ బ్రేక్ చేసినందున ప్రచారంపై మూడు రోజులు నిషేధం విధించాలని కోరింది.
ప్రభుత్వ భవనం టీ హబ్‌లో విద్యార్థులు, యువతతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారని గుర్తుచేసింది. ఇది ముమ్మాటికీ ఎన్నికల కోడ్ బ్రేక్ చేయడమే అవుతుందని చెబుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్నికల ప్రచారం చేయడం సరికాదని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కాంగ్రెస్ నేతల బృందం ఫిర్యాదు చేసింది.
తమ అభ్యంతరాలపై సీఈసీ స్పందించాలని, లేదంటే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని కొందరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. కాంగ్రెస్ నేతల కంప్లైంట్‌పై ఈసీ ఏ మేరకు చర్యలు తీసుకుంటుందో చూడాలి.