Congress Party: 60 మంది అభ్యర్థులకు బీ-ఫాం అందజేసిన కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు బీ-ఫాంలను అందించింది. నవంబర్ 10వ తేది వరకూ నామినేషన్లకు గడువు ఉండటంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకూ 100 మంది అభ్యర్థులను ప్రకటించగా మరో 19 స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసి త్వరలో ప్రకటించనుంది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు (Telangana Assembly Elections) దగ్గర పడుతున్నాయి. ఈ తరుణంలో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల ముందు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తమ తమ మేనిఫెస్టోల గురించి చెబుతూ ఊరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తమ పార్టీలోని 60 మంది అభ్యర్థులకు కాంగ్రెస్ పార్టీ (Congress Party) బీ-ఫాంలను అందించింది. మరో 37 మందికి కూడా త్వరలో అందించనుంది. అందులో సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు.
ఇకపోతే మరో 3 స్థానాలకు కూడా బీ-ఫాంలను పెట్టాలను ఏఐసీసీ (AICC) ఆదేశించింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండే తెలంగాణ (Telangana) అసెంబ్లీకి ఇప్పటి వరకూ కూడా 100 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. ఇకపోతే మరో 19 స్థానాలకు తమ అభ్యర్థులను కాంగ్రెస్ త్వరలో ప్రకటించనుంది.
మరోవైపు వనపర్తి, చేవెళ్ల, బోథ్ సెగ్మెంట్ల బీ-ఫాంలు ఏఐసీసీ ఆదేశాల మేరకు పెండింగ్లో ఉంచారు. నవంబర్ 3వ తేది నుంచి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. నవంబర్ 10 వరకూ నామినేషన్లకు గడువు ఉంది. నవంబర్ 30న పోలింగ్ నిర్వహించి డిసెంబర్ 3వ తేదిన ఓట్ల లెక్కింపును చేపడుతారు. అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో 5 రోజుల పాటు నామినేషన్ల పండగ జరగనుంది.