Fire in the drug rehabilitation centre in iran 32 people died 16 people were injured
ఇరాన్(iran)లోని ఉత్తరాన ఉన్న డ్రగ్స్ రిహాబిలిటేషన్ సెంటర్లో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో దాదాపు 32 మంది మరణించారు. అక్కడి మీడియా నివేదికల ప్రకారం ఉత్తర గిలాన్ ప్రావిన్స్‌లోని లంగర్డ్‌లోని సెంటర్లో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే మొదట 27 మంది మృతి చెందగా..వారి సంఖ్య క్రమంగా 32కు పెరిగిందని అక్కడి ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ మహ్మద్ జలాయ్ అన్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ఇరాన్‌లోని కాస్పియన్ సీ ప్రావిన్స్‌లోని గిలాన్లో ఈ ఘటన జరిగినట్లు ఇరాన్ మీడియో తెలిపింది. ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు గాయపడిన వారిని టెహ్రాన్‌కు వాయువ్యంగా 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్‌రౌడ్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఈ కేంద్రం సామర్థ్యం దాదాపు 40 మంది అని తెలుస్తోంది. దీంతోపాటు పునరావాస కేంద్రం నిర్వాహకులను అధికారులు విచారణ చేస్తున్నారు. మరోవైపు ఇరాన్లో ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని పలువురు చెబుతున్నారు. ప్రధానంగా భద్రతా ప్రమాణాలను విస్మరించడం, వృద్ధాప్య సౌకర్యాలు, సరిపోని అత్యవసర సేవల కారణంగా ఇలా జరుగుతాయని ఇంకొంత మంది అంటున్నారు. అయితే వీటిపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.